కార్తీక మాసంలో ఎందుకు 365 వత్తులు వెలిగించాలి..? వెలిగించేటప్పుడు పఠించే మంత్రం ఇదే..!

-

కార్తీకమాసం అంటే శివుడికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో శివుడుని ఆరాధించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీకమాసం ఇప్పటికే కొనసాగుతోంది. కార్తీక పౌర్ణమినాడు 365 వత్తులు వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. పౌర్ణమి తిథి నవంబర్ 15 శుక్రవారం ఉదయం 6:19కి మొదలవుతుంది. నవంబర్ 16 మధ్యాహ్నం 2:58 గంటలకు పూర్తవుతుంది. ఉదయం తిధి ఉండడంతో.. ఈసారి నవంబర్ 15న శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు తెలిపారు.

 

కార్తీక పౌర్ణమి నాడు దానము, గంగా స్నానము, హవనము, పూజలు చేస్తే మంచి జరుగుతుంది, కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలని పూజించినంత ఫలితం దక్కుతుంది. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయంలో దీపం పెట్టిన వాళ్లకు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.

నదుల దగ్గర దీపం వెలిగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏడాదిలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించలేకపోయినట్లైతే 365 వత్తుల దీపాన్ని వెలిగించుకుంటే దోషం పోతుంది అందుకని కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ కింది మంత్రాన్ని చదువుకోండి.

”కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!”

Read more RELATED
Recommended to you

Latest news