గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో నటి శ్రీరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ సపోర్టు మీడియాపై బూతుపురాణంతో అసభ్యకరమైన కామెంట్స్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో ఎవరైతే తమ ఫ్యామిలీని, పార్టీని కించపరిచిన వారిపై తాజాగా పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మాజీ సీఎం జగన్‌కు, మంత్రి నారాలోకేశ్‌కు సెపరేటుగా లేఖలు రాసింది. తన వల్ల వైఎస్సార్ సీపీ పార్టీకి ఎంతో నష్టం జరిగిందని, మీరంటే నాకు ఎంతో అభిమానం అని.. ఇకపై పార్టీకి, కేడర్‌కు దూరంగా ఉంటానని శ్రీరెడ్డి వైఎస్ జగన్, భారతికి క్షమాపణలు కోరుతూ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రి నారాలోకేశ్‌ను అన్నా.. అని సంభోదిస్తూ గతంలో తాను చేసిన తప్పులను క్షమించాలని మరో లేఖ రాశారు. చిరంజీవి, నాగబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను సైతం క్షమించాలని కోరారు.
క్షమించమని కోరుతూ వైఎస్ జగన్‌కు శ్రీరెడ్డి లేఖ
తన వల్ల వైసీపీకి చెడ్డ పేరు వచ్చిందంటూ లేఖలో పేర్కొన్న శ్రీరెడ్డి
చిరంజీవి, నాగబాబు, నారా లోకేష్ పేర్లను కూడా ప్రస్తావిస్తూ మరో లేఖ @ysjagan @SriReddyTalks #YSJagan #Chiranjeevi #NaraLokesh #Bigtv pic.twitter.com/CdRNC8IBVT
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024