న్యూఇయర్ కి మద్యం కొంటున్నారా…? ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

డిసెంబర్ 31″ తాగుబోతుల దినోత్సవం అని ఎవరు అన్నారో గాని అది ఏ విధంగా చూసినా సరే అక్షరాలా నిజం. ఏడాది మొత్తం జరిగిన అమ్మకాలతో ఈ ఒక్క రోజు అమ్మకాలు సమానం. భారీగా మద్యం అమ్మకాలు ఉండటంతో ఎక్కడ చూసినా సరే వైన్ షాపులు, బార్లు కాళీగా కనపడే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలోనే మద్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కీలక సూచనలు చేస్తున్నారు.

మద్యం కొనుగోలు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఆఫ్ లు, క్వార్టర్లు, అంతకంటే తక్కువ అసలు కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు.

ఈ రెండు రోజుల్లో కల్తీ మద్యం అనేది భారీగా బయటకు వస్తుంది. స్పిరిట్ కలిపిన మద్యం భారీగా విక్రయిస్తారు కాబట్టి, సీల్ తీసిన బాటిల్ అనేది అసలు కొనొద్దు.

అదే విధంగా ఈ రెండు రోజుల్లో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. కాబట్టి బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతాయి.

బీర్లు కొనే వాళ్ళు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త బ్రాండ్లు ఈ రెండు రోజులు మార్కెట్ లో ఎక్కువగా కనపడతాయి కాబట్టి, కొత్త వాటి జోలికి వెళ్ళకండి.

తక్కువ ధరల మద్యం అసలు కొనుగోలు చేయకండి. వాటిల్లోనే ఎక్కువ కల్తీ చేసే అవకాశం ఉంటుంది.

చీప్ లిక్కర్ సహా కొన్ని బ్రాండ్లు ఉంటాయి. 500 లోపే ఫుల్ బాటిల్ వస్తుంది. అవి ఎక్కువగా కల్తీ మధ్యమే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తాగితే తాగారు గాని జాగ్రత్తలు తీసుకుని తాగితే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version