తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సోమేశ్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్ గా సోమేశ్ కుమార్ వ్యవహరించనున్నారు. అలాగే కాసేపట్లో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు, సీఎస్ రేసులో ఉన్న ఎస్కే జోషిని ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా నియమించారు.
అయితే కొత్త సీఎస్ రేసులో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్, శాంతికుమారి, అధార్‌సిన్హా ఉన్నారు. వీరిలో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్ రేసులో ముందుండగా… సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. కాగా, ప్రస్తుతం ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సోమేశ్ కుమార్ తెలంగాణ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.