Chocolate Day Special : చాక్లెట్​ ఇచ్చి.. మీ ప్రేమను తీయని వేడుక చేసుకోండి

-

ప్రేమ.. ఈ రెండక్షరాల పదం రెండు జీవితాలను పరిపూర్ణం చేస్తుంది. రెండు మనసులను దగ్గర చేస్తుంది. రెండు మనసులు ఒకటై.. ఇద్దరు వ్యక్తులు ఒకటిగా బతకడమే ప్రేమంటే. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిందే వాలెంటైన్ వీక్. ఈ వీక్ స్టార్ట్ అయి అప్పుడే రెండ్రోజులై పోయింది. రోజ్ డే, ప్రపోజ్ డే.. గడిచిపోయింది. ఇక నెక్స్ట్.. చాక్లెట్ డే. అదేనండి ఇవాళ ప్రేమికులంతా చాక్లెట్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 

రోజ్ ఇచ్చి.. ప్రపోజ్ చేసిన తర్వాత ఇక ప్రేమికులకు పండగే కదా. అందుకే చాక్లెట్ ఇచ్చి తీయని వేడుక చేసుకుంటారు. మనసులోని భావాలను చాక్లెట్ ఇచ్చి తీయని మాటలతో చెప్పేయడమే ఈ డే స్పెషాలిటీ. చాక్లెట్లంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. వారికిష్టమైన చాక్లెట్లను అబ్బాయిలు వివిధ రకాలుగా డిజైన్ చేసి బహుమతిగా ఇస్తారు. వారి అభిమానాన్ని సంపాదించడానికి ఇదో ప్రయత్నం.

ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్వీట్స్ సరైన మార్గం. చాక్లెట్లు రుచికి తియ్యగా ఉన్నా.. వాటిని స్వీట్లుగా పరిగణనలోకి తీసుకోరు. కానీ ప్రేమికులకు అలా కాదు. ఇష్టమైన వారు చాక్లెట్ ఇస్తే.. ఇంప్రెస్ కాని వారు ఎవరూ ఉండరేమో. కాబట్టి చాక్లెట్ ను మించిన గిఫ్ట్ లేదనే చెప్పవచ్చు.

చాక్లెట్‌.. ఈ పేరు వినగానే మన మనసు దానివైపు పరుగులు తీస్తుంది.. మన నోరు దాని రుచి కోసం తహతహలాడుతుంది. చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వివిధ సందర్భాల్లో చాక్లెట్స్‌ తింటూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు చాక్లెట్లను బాగా ఇష్టపడతారు. తియ్యని వేడుక చేసుకుందాం అంటూ సాగే ప్రకటనలు అంత హిట్ అయ్యాయంటే కారణం కూడా అదే.

అందుకే వాలెంటైన్ వీక్​లో చాక్లెట్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అమ్మాయిలకు చాక్లెట్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే. ఒక్క చాక్లెట్ అమ్మాయిలకు ఉన్న కోపం మొత్తం క్షణాల్లో కరిగించేస్తుంది. చిన్ని చాక్లెట్ ఇచ్చి చూడండి.. వెంటనే మీ గర్ల్​ఫ్రెండ్ మీకో టైట్ హగ్ ఇచ్చేస్తోంది.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ చాక్లెట్స్‌ రుచి ఎవరు మాత్రం పడిపోరు చెప్పండి. అందుకే తియ్యని వేడుకకి సరైన జోడి ఈ చాక్లెట్స్. అందుకే వీటిని ఎక్కువగా ప్రేమ చిహ్నంగా ఇస్తారు. అయితే మీరు ప్రేమించిన వారికి కేవలం చాక్లెట్‌ మాత్రమే ఇవ్వకుండా.. ఓ గ్రీటింగ్‌ కార్డుతోనో.. లేదో ఓ స్వీట్ మెసేజ్​తోనే కలిపి ఇస్తే ఆ తీపి డబుల్ అవుతుంది.

ఓ చాక్లెట్ ఇచ్చి.. మీరు ప్రేమించిన వారి నోరు తీపిచేస్తూ.. వాళ్లు మీతో ఉంటే మీ ఫ్యూచర్ అంతా ఇలా స్వీట్​గా సాగిపోతుందని ఓ మాట చెప్పండి. మీ ప్రేమను ఇలా స్వీట్​గా ఎక్స్​ప్రెస్ చేశాక ఎవరైనా పడిపోతారు.

ఇక మార్కెట్​లో ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్​తో.. డిఫరెంట్ టేస్టుల్లో.. వెరైటీ డిజైన్లలో చాక్లెట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా వాలెంటైన్ స్పెషల్ చాక్లెట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ చాక్లెట్ ప్యాక్ కొనేయండి.. మీరు ప్రేమించిన వారి నోరు తీపి చేయండి.. హ్యాపీ చాక్లెట్ డే.

Read more RELATED
Recommended to you

Exit mobile version