Valantiens Day : ప్రేమ ఎలా పుడుతుంది..? అస్స‌లు ల‌వ్‌లో ఎందుకు ప‌డ‌తారు..?

-

మానసిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్న ప్ర‌కారం… చాలా వ‌ర‌కు యువ‌తీ యువ‌కులు ఒక‌ర్నొక‌రు మొద‌ట‌గా చూసుకోగానే వారి మ‌న‌స్సులో క‌లిగేది.. శారీర‌క ఆక‌ర్ష‌ణ‌నేన‌ట‌. ఆ ఆక‌ర్ష‌ణనే వారు ల‌వ్ అని భావిస్తార‌ట‌…
ప్రేమ అనేది స‌హ‌జంగానే ఎవ‌రికైనా క‌లుగుతుంది. కానీ ఎక్కువ‌గా యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారే ప్రేమ‌లో ప‌డ‌తారు. ఎందుకంటే.. ఆ వ‌య‌స్సులో వారి శ‌రీరంలో అనేక మార్పులు వ‌స్తుంటాయి. అలాగే కొత్త కొత్త ప‌రిచ‌యాలు సంభ‌విస్తుంటాయి. దీంతో స‌హ‌జంగానే యువ‌తీయువ‌కుల‌కు ఒక‌రంటే ఒక‌రికి ఆక‌ర్ష‌ణ ఏర్ప‌డుతుంది. అది స్నేహంగా మారి చివ‌ర‌కు ల‌వ్‌కు దారి తీస్తుంది. అయితే యువ‌తీయువ‌కులు ఎవ‌రైనా స‌రే… ల‌వ్‌లో ఎందుకు ప‌డతారు..? అందుకు కార‌ణాలు ఏమిటి..? అనే విష‌యాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే…

మానసిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్న ప్ర‌కారం… చాలా వ‌ర‌కు యువ‌తీయువ‌కులు ఒక‌ర్నొక‌రు మొద‌ట‌గా చూసుకోగానే వారి మ‌న‌స్సులో క‌లిగేది.. శారీర‌క ఆక‌ర్ష‌ణ‌నేన‌ట‌. ఆ ఆక‌ర్ష‌ణను వారు ల‌వ్ అని భావిస్తార‌ట‌. ఈ క్ర‌మంలో ఆ ఆక‌ర్ష‌ణ కాస్తా ల‌వ్‌కు దారి తీస్తుంది. దీంతో సుల‌భంగా ప్రేమ‌లో ప‌డ‌తారు. యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డేందుకు వారి మ‌ధ్య ఏర్ప‌డే శారీరక ఆక‌ర్ష‌ణ కూడా ఒక కార‌ణ‌మ‌ని మానసిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అందుక‌నే యువ‌తీయువ‌కులు స‌హ‌జంగానే ఒక‌ర్నొక‌రు మొద‌టగా చూసుకోగానే ల‌వ్‌లో ప‌డ‌తారట‌.

ఇక యువ‌తీయువ‌కులు ల‌వ్‌లో ఎందుకు ప‌డ‌తారనే విష‌యం వెనుక ఉన్న మ‌రో కార‌ణం.. ఎవ‌రైనా యువ‌తి లేదా యువ‌కుడు త‌మ ప‌క్క‌న ఉన్న‌ప్పుడు కొంద‌రికి మ‌న‌స్సులో ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ వ‌స్తాయ‌ట‌. అంటే వారి ప‌క్క‌న ఉండాల‌ని, అలా ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటూ.. కొంద‌రు ఇత‌రుల సాంగ‌త్యాన్ని కోరుకుంటుంటారు. అది ఆ యువ‌తీయువ‌కుల‌ను ప్రేమ‌లో ప‌డేస్తుంది. అలాగే యూత్ ల‌వ్‌లో ఎందుకు ప‌డ‌తార‌నే విష‌యం వెనుక ఉన్న చివ‌రి కార‌ణం ఏమిటంటే.. యువ‌తీయువ‌కులు ఒక‌ర్నొక‌రు తొలిసారిగా చూసుకున్న‌ప్పుడు వారితో జీవితాంతం ఉండాల‌నే భావ‌న క‌లుగుతుంద‌ట‌. అది వారిని ప్రేమ‌లో ప‌డేస్తుంది.. ఈ మూడు కార‌ణాల వ‌ల్లే యూత్ ప్రేమ‌లో ప‌డ‌తార‌ని మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version