ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. మహిళా దినోత్సవ సందర్భంగా మీరు మహిళామణులకి మనసారా శుభాకాంక్షలు తెలపాలనుకుంటే ఈ కోట్స్ తో విష్ చేయండి .అలానే ఒక చిన్న గిఫ్ట్ ని వారికి ఇవ్వండి.
వాళ్లు అందిస్తున్న సేవకి గాను వాళ్ళు చేస్తున్న సహాయానికి గాను ఒక చిన్న బహుమతిని ఇవ్వండి దీంతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. మరి మహిళా దినోత్సవం నాడు మీరు అందమైన
కోట్స్ తో విష్ చేయాలి అని అనుకుంటే ఈ కోట్స్ ని షేర్ చేసుకోండి. ఇవి వాళ్ళ మనసుని తాకే విధంగా ఉంటాయి.
ఈ అందమైన కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండి:
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’… స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. ఎప్పుడు నాకు సపోర్టు ఇచ్చే నీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ ఎంతో చక్కగా ఏ లోటు లేకుండా చూసుకునే నీకు ఏమి ఇచ్చిన తక్కువే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అందర్నీ కనుపాపలా తలచి, మాకోసమే అహర్నిశలు ఆలోచించే నీకు హ్యాపీ ఉమెన్స్ డే..
కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే… ఓ మాతృ మూర్తి.. నీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు… హ్యాపీ ఉమెన్స్ డే…
వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మా హ్యాపీ ఉమెన్స్ డే..
ఓ మహిళా నీవు నా జీవితం భాగస్వామి కావడం నా అదృష్టం – హ్యాపీ ఉమెన్స్ డే…