ప్రస్తుతం మనం సంపాదిస్తున్న వాటిలో అధికంగా ఖర్చులకే పోతుంది. ఎక్కువగా మిగలడం లేదు. చాలా మంది ఒకటికి మించి ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఇక ఎక్కువ రిస్క్ లేకుండా.. సింపుల్‌గా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకుంటే వారికి LPG గ్యాస్ ఏజెన్సీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. గ్యాస్ బిజినెస్ గురించి ప్రస్తుతం కొన్ని ఫేక్ వార్తలు వస్తున్నాయి. వాటిని చెక్ చేసుకొని లేదా జాగ్రత్తగా చూసుకొని మనం బిజినెస్ ను ప్రారంభిస్తే.. బాగుంటుంది. లేకపోతే మనం మోసపోతాం.
చమురు మార్కెటింగ్ కంపెనీ LPG ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం ఆమోద లేఖ ఇస్తుందా? లేదా అనే విషయంలో తర్జన భర్జన పడుతుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేక్ వార్తలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరూ ఫేక్ వార్తల ద్వారా డబ్బులను దండుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కూడా. కొంత మంది ఇలాంటి వార్తల ద్వారా మోసపోతారు. LPG ఏజెన్సీ డీలర్ షిప్ కోసం ధరఖాస్తు చేసుకోండి.. అని ఓ వెబ్ సైట్ ను క్రియోట్ చేసి.. డబ్బులు లాగుతున్నారట. అది ఫేక్ అని హెచ్ పీ గ్యాస్ కంపెనీ తాజాగా ప్రకటించింది. అందుకే ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.