ఫ్యాక్ట్ చెక్: స్టేట్ బ్యాంక్ యోనో అకౌంట్ బ్లాక్ అయ్యిందని మెసేజ్ వచ్చిందా..? నమ్మచ్చా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. కానీ ఏది పడితే దాన్ని నమ్మద్దు. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు.

పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

తాజాగా చాలా మంది ఫోన్లకి ఒక మెసేజ్ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో అకౌంట్ బ్లాక్ అయిందని… వెంటనే పాన్ కార్డుని అప్డేట్ చేసుకోమని ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ తో లాగిన్ అవ్వమని ఒక మెసేజ్ వస్తోంది. అయితే మరి నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెసేజ్ ని పంపుతోందా..? ఈ మెసేజ్ ని నమ్మొచ్చా..? ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చా అనేది చూస్తే… ఈ మెసేజ్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపించడం లేదు.

ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద స్పందించి ఇది వట్టి ఫేక్ వార్త అనేది తెలిసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నకిలీ వార్త అని చెబుతోంది. కనుక అనవసరంగా ఫేక్ వార్తని నమ్మి మోసపోకండి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version