ఫ్యాక్ట్ చెక్: చైనా దీపావళి సామాన్ల వలన అనారోగ్య సమస్యలా..? నిజమెంత..?

-

దీపావళి పండుగ అంటే భారతీయులందరూ దీపావళి సామాన్లు తెచ్చుకోవడం.. ఇల్లంతా అలంకరించుకుని వాటిని కాల్చడం… స్వీట్లు చేసుకోవడం ఇలా చాలా ఉంది. ఇప్పటికి కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒక మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

చైనీయులు తయారు చేసిన దీపావళి సామాన్లుని కాల్చడం వల్ల మరియు లైట్ల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ మెసేజ్ లో ఉంది. మరి ఇక దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇంస్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో ఫేక్ వార్తలు వినబడుతున్నాయి.

దీనితో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే మెసేజ్ లో పాకిస్తాన్ భారతదేశాన్ని డైరెక్ట్ గా ఎటాక్ చేయలేదని అందుకనే చైనాని రివెంజ్ తీర్చుకోవడానికి అడిగిందని… అందుకనే చైనీయులు దీపావళి సామాన్ల లో కెమికల్స్ మరియు ఇతర గ్యాస్లను ప్రవేశపెడుతున్నారు. దీని కారణంగా ఆస్తమా సమస్య వస్తుందని అలానే లైట్లు మొదలైన వాటి వల్ల కంటి సమస్యలు కూడా వస్తాయని అందులో ఉంది.

పైగా ఈ విషయాన్ని హోం మినిస్ట్రీ చెప్పిందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంది అని కూడా ఈ మెసేజ్ లో ఉంది. దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. ఇది కేవలం ఫేక్ వార్తని ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు మరియు ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version