గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదమని మండిపడ్డారు హరీశ్ రావు. గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదన్నారు. సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదని చురకలు అంటించారు. ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలు అంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి హరీశ్ రావు.
ఏడాదిన్న పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్ర సంగం అన్నారు. అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ దని తెలిపారు. మసిపూసి మారేడుకాయ మాటలు గవర్నర్ తో చెప్పించారు..ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించినా అత్యాశే అవుతుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై శాసన సభ, మండలిలో నిలదీస్తాం, ఎండగడుతామని హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం అంటే…ప్రజల జీవితాల్లో దశ దిశ అని భావించిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు.