ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ వార్తలని చూస్తే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి. చాలా మంది సోషల్ మీడియా లో వచ్చే నకిలీ వార్తలని చూసి మోసపోతున్నారు. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి ఇంతకీ ఇది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఎలక్షన్ బిల్ ప్రకారం ఆధార్ ఓటర్ ఐడి రెండిటిని లింక్ చేసుకోవాలని.. సోషల్ మీడియాలో వార్త వస్తోంది. Election Laws (Amendment) Bill, 2021, ప్రకారం నిజంగా ప్రతి ఒక్కరూ వారి ఆధార్ తో ఓటర్ ఐడి కార్డ్ ని లింక్ చేసుకోవాలా..? లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తుందా..?
దీనిలో నిజం ఎంత అనేది చూస్తే ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడం అనేది తప్పనిసరి కాదు. ఇది ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళ ఇష్టం ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కనుక అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తల్ని చూసి మోసపోకండి.