వాస్తు: ఉత్తర దిశ లో వీటిని పెట్టండి.. ఆర్ధిక బాధలే వుండవు..!

-

చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా మీరు అనుసరిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి.

ఉత్తర దిశలో కనుక మీరు పండితులు చెప్పినట్లు ఉంచితే ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండటానికి అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉత్తరం వైపు సిల్వర్ కాయిన్ ని ఒక గాజు బౌల్ లో వేసి ఉంచండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది.

అలానే ఈశాన్యం వైపున లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలని ఉంచండి ప్రతిరోజు వాటికి దీపాన్ని పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక నష్టం వంటి సమస్యలు కూడా రావు. ఇంటికి ఉత్తరం వైపు తులసి మొక్కని ఉంచడం కూడా మంచిది ఇది కూడా ఆర్ధిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీలం రంగు పిరమిడ్ ని ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బులు ఖాళీ అయిపోవు. అలానే ఈశాన్యం వైపున మీరు మనీ ప్లాంట్ ను ఉంచడం కూడా మంచిది. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఇబ్బందుల నుండి బయటపడొచ్చు ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version