ఫ్యాక్ట్ చెక్: చెన్నై ఎయిర్ పోర్ట్ అంటూ వచ్చిన వీడియోలో నిజమెంత..?

-

సోషల్ మీడియాలో వచ్చే వార్తలుకు హద్దు లేకుండా పోతోంది. రోజురోజుకీ మనకి ఫేక్ వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కొన్ని వార్తలు అయితే నమ్మాలో లేదో అనేది కూడా తెలియడం లేదు. అయితే ఇటువంటి ఫేక్ వార్తలు వల్ల నిజంగా మోస పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్కీములు, ఉద్యోగాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే డబ్బులన్నీ పూర్తిగా పోతాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే అసలు ఆ వీడియోలో ఏముంది..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని రోజుల నుండి తమిళనాడులోని ఎక్కువగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

ముఖ్యంగా చెన్నై లో వానలు ఎక్కువగా పడడం జరిగింది. అయితే ఈ వీడియోలో భారీ వర్షాల కారణంగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నీటితో నిండి పోయిందని ఉంది. ఇదే వీడియోని తమిళనాడులో కొన్ని న్యూస్ చానల్స్ లో కూడా చూపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో నిజం ఎంత అనేది చూస్తే… ఇది ఫేక్ వీడియో అని తెలుస్తుంది.

ఈ వీడియోని 2017 లో మెక్సికో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించారు. కానీ అది సోషల్ మీడియాలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో వీడియో అని ఉంది. అయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సర్వీసులు నిలిపివేయడం వాస్తవమే కానీ ఈ వీడియో మాత్రం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version