ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి నకిలీ వార్తలను అనవసరంగా నమ్మి మోసపోకూడదు. ఏ వార్త నిజం, ఏ వార్త అబద్దం అనేది తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ రోజు తాజాగా వచ్చిన ఒక వార్త గురించి చూద్దాం. ఇంటర్నెట్ ని ఈ మధ్య కాలం లో అందరూ వాడుతున్నారు.
ఇంటర్నెట్ అభివృద్ధితో పాటు ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా అవుతున్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇటువంటి మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. samagra.shiksha abhiyan.gov.in అనే ఒక అఫీషియల్ వెబ్ సైట్ సర్వ శిక్ష అభియాన్ అనే పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉంది.
కానీ నిజానికి ఇది ఫేక్ వార్త. ఎటువంటి ఉద్యోగ అవకాశాలని ఈ వెబ్సైట్ అందించడం లేదు. కనుక ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నకిలీ వార్తలను నమ్మి మోసపోవద్దు. వీటి వల్ల మీకు ఎక్కువ నష్టం కలుగుతుంది. అలాగే తెలియని వెబ్సైట్ కి డబ్బులు కట్టొద్దు. అలానే ఈ ఫేక్ సమాచారాన్ని అనవసరంగా ఇతరులకు కూడా షేర్ చేయద్దు.