తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ నేతలకు న్యాయం చేసేలా కృష్టి చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్. పార్టీ ఫిరాయించిన వారికి చెక్ పెట్టనున్నారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ నాయకులను మూడు కేటగిరీలుగా విభజించారు ఇంచార్జి మీనాక్షి నటరాజన్.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఒరిజినల్ నాయకులను ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారిని రెండో గ్రూప్ చేశారు.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని మూడో గ్రూప్ గా ఏర్పాటు చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకున్నారు.