తిరుమల లోయలో దూకిన వ్యక్తి..ఆచూకి ఇంకా దొరకలేదు. తిరుమల నడకమార్గంలో లోయలో దూకిన వ్యక్తి సిద్దారెడ్డిగా గుర్తించారు పోలిసులు. 4వ తేది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైలులో వచ్చాడు భక్తుడు. ఇక నిన్న ఉదయం 9 గంటల సమయంలో అక్కగార్ల గుడి వద్ద అవ్వాచారి కోనలో దూకాడు భక్తుడు. దీంతో లోయలో టిటిడి బృందం గాలించినా ఆచూకి దొరకలేదు.
దీంతో సిసి పుటేజి ఆధారంగా పోటో రిలిజ్ చేశారు పోలీసులు. భక్తుడి ఆచూకి లభిస్తే సమాచారం అందించాలన్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.