ఫ్యాక్ట్ చెక్ : ఫ్రీగా ప్రభుత్వం నుండి ల్యాప్టాప్స్..?

-

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తల గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నకిలీ వార్తలతో దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాల స్కీములని అందిస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం స్కీములని చెప్పి చాలా నకిలీ వార్తలు తరచూ కనపడుతూ ఉంటాయి.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా లాప్టాప్ లను ఇస్తోందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా లాప్టాప్ లను ఇస్తోందా అందులో నిజం ఎంత అనే విషయానికి వచ్చేస్తే.. ఇది ఫేక్ అని తెలుస్తోంది.

ఇందులో ఏ మాత్రం నిజం లేదు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా లాప్టాప్స్ ఇస్తుందంటూ వచ్చిన నోటీసు వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ లాప్టాప్ స్కీం 2023 అంటూ ఏమీ లేదు కాబట్టి అనవసరంగా ఇటువంటి వాటిని నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version