ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నారు… అయితే తాజాగా టికెట్ బుకింగ్ కోసం కొత్త నియమాలు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వార్త ఏంటంటే.. రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి కొత్త IRCTC నియమాలు ఉన్నాయని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది… ఆ పోస్ట్‌లో, ‘వ్యక్తులు వ్యక్తిగత IDని ఉపయోగించి రక్తసంబంధాలు లేదా అదే ఇంటిపేరు ఉన్నవారికి మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. స్నేహితులు లేదా ఇతరుల కోసం బుకింగ్ చేస్తే భారీ జరిమానా రూ. 10,000 లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండూ ఉంటాయాని వార్తలు వినిపిస్తున్నాయి..
కేవలం తెలియనివారికి టికెట్ బుక్ చేసిపెట్టడంలో తప్పేంటి? అంతమాత్రానికే జైల్లో వేసేస్తారా..?అనుకుంటున్నారా? రైల్వేశాఖ ఈ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. స్నేహితులు, బంధువులు, టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారికి, మనకు తెలిసిన వారికి టికెట్ బుక్ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే.. నిజానికి ఇండియన్ రైల్వేస్ ఇలా మెసేజ్ ల ద్వారా ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఇవ్వదు.. అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే ఇండియన్ రైల్వే కు సంబందించిన ఏదైన సమాచారాన్ని అందిస్తారు.. ఇది అవాస్తవం అని తేలింది.. ఇంటిపేర్ల కారణంగా ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి గురించి సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉన్న వార్తలను తప్పుదారి పట్టించేదిగా పేర్కొంటూ IRCTC ద్వారా వివరణ ఇచ్చారు..
ఇక అంతేకాదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రకారం ఇది ఫేక్ అని నిరూపించారు.. ఇండియన్ రైల్వే ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఎప్పుడూ ఇవ్వదని పేర్కొంది.. ఇలా కుటుంబానికి చెందని వ్యక్తుల కోసం IRCTC టిక్కెట్ బుకింగ్ కోసం కొత్త నియమాలు అనేవి లేవు.. ఇలాంటి వార్తలను అస్సలు నమ్మకండి అంటూ తేల్చి చెప్పేసింది.. ఇంఫర్మేషన్ ఇవ్వరు అని గుర్తించగలరు.. దయచేసి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోకండి అంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
It is being claimed in social media posts that as per new rules of @IRCTCofficial, individuals can only book railway tickets for blood relatives or those with the same surname. #PIBFactCheck
❌This claim is #Misleading
1/2 pic.twitter.com/eS4NEYTFGE
— PIB Fact Check (@PIBFactCheck) June 25, 2024