Fact Check : 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి చెల్లుతాయా? చెల్లవా? క్లారిటీ ఇదే!

-

500 రూపాయల నోటుపై ఇప్పటికీ కూడా చాలామందికి చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. మార్కెట్‌లో నకిలీ కరెన్సీ నోట్లు విసృతంగా సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో.. స్టార్ గుర్తు ఉన్న 500 కరెన్సీ నోట్లను తీసుకునేందుకు చాలా మంది కూడా నిరాకరిస్తున్నారు.ఆ నోట్లు నకిలీవి అంటూ అవి అసలు మార్కెట్‌లో చెల్లవంటూ.. సోషల్ మీడియాలో కూడా చాలా రకాల పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఈ పుకార్లపై గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

 

స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు ఫేక్ కావని ఆర్బీఐ వెల్లడించింది. ప్రింటింగ్ లోపం ఉన్న నోట్ల ప్లేసులో వీటిని ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 1 నుంచి 100 దాకా ఉండే సీరియల్ నంబర్ నోట్లలో ప్రింటింగ్ ఇబ్బందులు ఏమైనా తలెత్తితే.. ఉన్న వాటి ప్లేసులో ఈ స్టార్ గుర్తున్న నోట్లను ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంటే.. స్టార్ సింబల్ ఉంటే ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని RBI సూచించడం జరిగింది. ఇక ఈ 500 నోటుపై సీరియల్ నంబర్‌కి ముందు స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా మార్కెట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చలామణి అవుతాయని తెలిపింది.

స్టార్ సింబల్ ఉంటే మరొక నోటు ప్లేసులో ఈ నోటు ముద్రించినట్లు అర్థమని RBI తేల్చి చెప్పింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని RBI క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా లోపభూయిష్టంగా ఉన్న నోట్లను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఈ స్టార్‌ గుర్తును నంబరింగ్ ప్యానెల్‌లో జత చేయాల్సి వచ్చిందని RBI ఉనియోగదారులకు ఫుల్ గా క్లారిటీని ఇచ్చేసింది. కాబట్టి స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు మీ వద్దకు వస్తే ఏమాత్రం కంగారు పడకండి. అవి కూడా మిగతా నోట్లు లాగే చెల్లుబాటులో ఉన్నట్లే లెక్క. కాబట్టి కంగారు పడకండి నిశ్శందేహంగా ఈ నోట్లని మీరు మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version