వాతావరణంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది ఎవరూ ఊహించలేము.. వాతావరణ శాఖలు కూడా పరికరాల సహాయంతో పరిస్థితిని అంచనా వేయగలవే కానీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్ మరియు బంగాళాఖాతంలో “హామూన్” తుఫాన్ లు ఏర్పడనున్నాయంటూ IMD ప్రకటించింది. ముఖ్యంగా తేజ్ తుఫాన్ అతి తీవ్రంగా మారి యెమెన్ – ఒమన్ తీరాల వైపు ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. ఇక హామూన్ తుఫాన్ ఏపీ తీరం దిశగా వస్తున్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మరికొన్ని గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ తుఫాన్ ప్రభావం వలన తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది.
కాబట్టి ఈ రెండు రాష్ట్రాలలో తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు సూచించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.