బోరబండ క్వారీలో గల్లంతైన యువకుడు.. ఇంకా లభించని ఆచూకీ

-

బోరబండ క్వారీలో గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులో ఈత కోసం వెళ్లి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఆదిభట్ల మున్సిపాలిటీలోని కొంగర కాలన్ పరిధిలోని కలెక్టరేట్ కార్యాలయం వెనుక ఉన్న బోరబండ క్వారీ చెరువులో ఆదివారం మధ్యాహ్న సమయంలో నగరానికి చెందిన ఆరుగురు యువకులు ఈత కోసమని వెళ్ళగా హైదరాబాదులోని ఉప్పుగూడ కు చెందిన జి కిరణ్ కుమార్ వయసు 19 సంవత్సరాలు నీటిలో మునిగి గల్లంతవ్వడం జరిగింది.

గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం డిఆర్ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది చెరువులో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి కారణాలపై విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version