స్ఫూర్తి: హిమాచల్ ప్రదేశ్ లో సౌత్ ఇండియన్ హోటల్… సంపాదన లక్షల్లో..!

-

జీవితంలో ప్రయత్నం అనేది చాలా ముఖ్యమైనది. మనం ప్రయత్నం చేయకపోతే ఏమీ చేయడం కుదరదు. అందుకని తప్పకుండా జీవితంలో మంచి స్టెప్ తీసుకోవాలి. నిజంగా మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు మంచి ఫలితాలను అందిస్తాయి. మీపై నమ్మకం పెట్టి మీరు నిర్ణయాలను కనుక ధైర్యంగా తీసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అనుకున్నది పూర్తి చేయగలరు.

అదే విధంగా సూరజ్ కూడా ధైర్యంగా తను అనుకున్న స్టెప్ ని తీసుకున్నారు. దక్షిణ భారత రుచికరమైన వంటలను తన కేఫ్ ద్వారా మొదలు పెట్టి ఇప్పుడు మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక మరి ఈయన బిజినెస్ గురించి పూర్తిగా చూస్తే.. హిమాచల్ ప్రదేశ్ లోనే అవ్వ కేఫ్ ని సూరజ్ స్టార్ట్ చేసారు. ఈ కేఫ్ ద్వారా దక్షిణ భారతదేశ వంటకాలను అందిస్తున్నారు.

ఒక రోజు హిమాచల్ ని సూరజ్ చూడడానికి వెళ్లారు. అయితే అక్కడ వాతావరణం ఈయనకి బాగా నచ్చేసింది. దీనితో సూరజ్ అక్కడ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. చాలా కష్టపడి తన తల్లిదండ్రులను ఒప్పించి ధైర్యంగా ఈ నిర్ణయం ని సూరజ్ తీసుకున్నారు. ఇక్కడ దోస మొదలైన దక్షిణ భారత వంటకాలు దొరుకుతాయి.

అలానే దక్షిణ భారత దేశ స్టైల్ లో వుండే అప్పాలు, దహీ వడ, పొడి ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ తెలుగు యువకుడు హిమాచల్ ప్రదేశ్లో లక్షలు సంపాదిస్తున్నారు. నిజానికి ఇలాంటి వాళ్లని ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా విజయం సాధించడానికి అవుతుంది. ఏం అవుతుంది భవిష్యత్తు అని భయపడి పోతే అక్కడితోనే ఆగిపోవలసి ఉంటుంది. ఇంకేం ముందుకి వెళ్తాము..?

Read more RELATED
Recommended to you

Exit mobile version