పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రంం రాబోతుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.బాలీవుడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేను తీసుకునేునే ఆలోచనలో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే, ప్రధాన తారాగణం లో దీపికా కూడా చేరితే..ఈ చిత్రంపై ఉన్న హైప్ ఇంకా రెట్టింపు అవుతుంది.
ప్రస్తుతం హిందీ సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్ నుండి ప్లాన్ చేస్తున్నాడు.అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తుందనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి నటనకి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ తోడైతే సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని అంచనా..