మామూలుగా సామాన్యులు ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా ఏమి చేసినా పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులు వారికి తగిన శిక్షను విధిస్తూ ఉంటారు. రూల్ ను బట్టి శిక్ష ఉంటుంది, కొందరు పోలీసులు అయితే అన్నీ రికార్డ్స్ సరిగా ఉన్నా ఏదో ఒక రూల్ పేరు చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకునే ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై బాధితులు బాధపడుతున్న మాట వాస్తవమే.
కానీ ఇలా రూల్స్ పాటించండి అని చెప్పే పోలీసులు మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ ను పెడచెవిన పెట్టి వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు… డ్యూటీ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడడం, వీరు బైక్ లో ట్రిపుల్స్ వెళ్ళడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటివి.. ఇవన్నీ నిశితంగా గమనించిన రాజస్థాన్ డిజిపి పోలీసులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోలీసులు ట్రాఫిక్ రుల్స్ ను అతిక్రమిస్తే వారిపై డబుల్ జరిమానా విధిస్తామని చెప్పారు. దీనితో ఆ రాష్ట్ర పోలీసులు షాక్ అవుతున్నారు.