చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా !

-

చంద్రబాబు కు సంబంధించి స్కిల్ స్కాం కేసులో అనుమానితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబు తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ ను అడగడంతో, నాలుగు వారాలను మంజూరు చేసింది హై కోర్ట్. ఇక చంద్రబాబుకు బెయిల్ కోసం లాయర్లు పిటిషన్ వేయగా దానిపై విచారణ చేసింది హై కోర్ట్. ఈ విచారణలో భాగంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఒకరూటుకు వివరించి రిపోర్ట్స్ ను సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ ను సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వీకరించి తన తరపున వాదనలు వినిపించారు. ఈ వాదనలను విన్న హై కోర్ట్ తదుపరి వాదనలను రేపు మధ్యాహ్నం వింటామని విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరి ఈ కేసులో చంద్రబాబు కు పూర్తి బెయిల్ మంజూరు చేస్తారా అస్సలు హై కోర్ట్ ఏ విధమైన తీపును ఇస్తుందన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version