ఈ జనరేషన్ వారికి తెలియదేమో కానీ.. 90s లో చదువుకున్న వారికి పుస్తకాలు, చిరిగిన పేపర్లు, అట్టలు అంటించుకోవాడనికి నల్లతుమ్మచెట్టు నుంచి వచ్చే బంకను వాడేవారు కదా..ఆ బంక తీసుకుని చిరిగిన పేపర్లు అంటిస్తే భలే స్ట్రాంగ్ గా అంటుకునేవి. నల్ల తుమ్మచెట్టు కొమ్మతో కొందరు పళ్లు కూడా తోముకునేవాళ్లు. నల్లతుమ్మచెట్టు బెరడు కూడా ఆరోగ్యానికి మంచిదని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఊర్లల్లో ఏదైనా ఉచితంగా వస్తుంది.. కానీ అవే సిటీల్లో అయితే డబ్బులిచ్చి కొనాలి. ఈ బెరడునుే 100 గ్రాములు 80-100 రూపాయిల మధ్యలో అమ్ముతున్నారు. ఈరోజు మనం ఈ బెరడు వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
నల్ల తుమ్మచెట్టు బెరడును పొడిచేసి నీళ్లలో వేసి మరిగించి.. ఫిల్టర్ చేసుకుని తాగితే.. ఆరోగ్యానికి మంచిదని 2012వ సంవత్సరంలో ది ఇస్లామియా యూనివర్శిటీ ఆఫ్ బహవల్పూర్- పాకిస్థాన్ ( The Islamia University Of Bahawalpur- Pakistan) వారు నిరూపించారు. ఈ డికాషన్ తాగటం వల్ల బాడీలో ఉండే బాక్టీరియాలు, ఫంగస్ క్రిములు 10-15 నిమిషాల్లోనే పూర్తిగా చనిపోతున్నాయి అని నిరూపించారు. హానికలిగంచే బాక్టీరియాలు అంటే..E.coli, Staphylococcus, Streptococcus, Bacillus, Shigella ఇవన్నీ నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్నాయని నిరూపించారు. మనకు ఇన్ఫెక్షన్ కలగడానికి ప్రధానంగా ఇవే కారణం.
మనకు Salmonella typhi అనే బాక్టీరియా కారణంగా.. టైఫాయిడ్ వస్తుంది. ఇది ఎక్కువగా నీళ్లలో ఉంటుంది. తాగే నీరు కలుషితంగా ఉన్నప్పుడు అందులో ఈ బాక్టీరియా ఉంటే పొట్టప్రేగుల్లో ఇన్ఫక్షన్ కలిగించి టైఫాయిడ్ వస్తుంది. ఇక టైఫాయిడ్ ఫీవర్ వచ్చిదంటే. మినిమమ్ 15 రోజులు పట్టింది. టైఫాయిడ్ బాక్టీరియాలు కూడా.. ఈ నల్లతుమ్మబెరడు డికాషన్ తాగడం వల్ల చనిపోతాయి.
ఎక్సర్ సైజ్ బాగా చేసేవారికి, ఎక్కువ కష్టపడే వారికి, ఫిజకల్ యాక్టివిటీ బాగా ఉండే వారికి.. మజిల్ పెయిన్స్ ఉంటాయి. వీటిని తగ్గించడానికి కూడా ఈ డికాషన్ ఉపయోగపడుతుంది. మజిల్స్ ఉండే కాల్షియం, పొటాషియం ఛానల్స్ ను కంట్రోల్ చేసి.. మజిల్స్ త్వరగా రిలాక్స్ అయ్యేట్లు చేయడానికి, మజిల్స్ నొప్పులను తగ్గించడానికి ఈ డికాషన్ అద్భుతంగా పనికొస్తుందట.
బీపీ వచ్చినవారికి బ్లడ్ వెజల్స్ హార్డ్ అయి ముడుచుకుంటాయి. నల్ల తుమ్మచెట్టు డికాషన్ అనేది బ్లడ్ వెజల్స్ ను డైలేట్ చేయడానికి ఉపయోగపడుతుందట. దీని ద్వారా బీపీ తగ్గడమే కాకుండా.. రక్తనాళాలు స్మూత్ అయి.. సరఫరా బాగుంటుంది.
ఈరోజుల్లో చాలామందికి 50-60 ఏళ్లు దాటిన తర్వాత పార్కిన్సన్స్ సమస్య వస్తుంది. వణుకుతారు. ఒంటరిగా నడవలేరు. ఏది పట్టుకోలేరు. ఈ సమస్య రాకుండా ఉండటానికి, వచ్చిన వారికి తగ్గడానికి నల్లతుమ్మచెట్టు కషాయం చాలా బాగా పనికొస్తుంది.. ఎలా అంటే.. ఫస్ట్ ఈ పార్కిన్సన్స్ సమస్య రావడానికి మెదడులో రిలీజ్ అయ్యే Acetylcholinesterase అనే ప్రక్రియను అడ్డుకోని.. ఈ సమస్య రాకుండా డికాషన్ ఉపయోగపడుతుందట.
కణజాలంలో RNAలో మ్యూటేషన్ జరగకుండా చేసి క్యాన్సర్ , దీర్ఘకాలిక రోగాలు రాకుండా చేయాడనికి, క్యాన్సర్ వచ్చిన వారు కీమో థెరఫీతీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేయడానికి ఈ కషాయం బాగా ఉపయోగపడుతుందని కూడా నిరూపించారు.
పైన పేర్కొన్న సమస్యలతో బాధపడేవారు.. ఇప్పటికే తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఉంటారు. వీటితోపాటు.. ఇలాంటి ఔషధాలు కూడా తోడైతే.. రిజల్ట్ ఇంకా బాగుంటుంది. సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు కాబట్టి ఇబ్బందిలేని వారు.. ఈ డికాషన్ చేసుకుని తాగొచ్చు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu