ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో ఉద్యోగాలు… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని భువనేశ్వర్‌ లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ ట్యూటర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానం  లో భర్తీ చేస్తోంది. ట్యూటర్‌/డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. అయితే దీనిలో మొత్తం 18 ఖాళీలు వున్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, పోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌, ఫిజియాలజీ విభాగాలలో ఈ ఖాళీలు వున్నాయి.

వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించారాదు. అర్హట వివరాలను చూస్తే.. ఎంబీబీఎస్‌/ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలానే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 17, 2022. పూర్తి వివరాలను https://aiimsbhubaneswar.nic.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version