అవాంఛిత రోమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న మహిళ

-

ఈ రోజుల్లో సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేట్‌ చేసి సంపాదిస్తున్నారు. ఇక మనలాంటి వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు అని కొందరు అమ్మాయిలు ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. జనాలు మనల్ని ఎలా చూస్తారో అని ఇంట్లో కూర్చోకుండా తలలు పరుగెత్తిస్తే కోట్లు సంపాదించుకోవచ్చు.ఓ మహిళ తన కాళ్ల ఫోటోలను పోస్ట్ చేసి ధనవంతురాలైంది. ఇంకో మహిళ వాడేసిన ఇన్నర్స్‌ ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుంది. కానీ ఈమె వాళ్లందరికంటే.. ఇంకా వెరైటీ. అవాంఛిత రోమాల ద్వారా కోట్లు సంపాదించేస్తుంది.!

మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ముఖంపైనా, శరీరంపైనా ఎక్కడా అవాంఛిత రోమాలు ఉండకూడదనేది వారి కోరిక. అదే కారణంతో కనుబొమ్మలను షేప్‌ చేస్తారు. అండర్ ఆర్మ్ క్లీనింగ్ కూడా చేస్తారు. అయితే ఈ యువతి మాత్రం తన అండర్ ఆర్మ్ హెయిర్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది.

అండర్ ఆర్మ్ హెయిర్ ద్వారా 8 కోట్ల సంపాదన :

ఈ యువతి తన అండర్ ఆర్మ్ హెయిర్ ఫోటో ద్వారా సంవత్సరానికి సుమారు ఒక మిలియన్ డాలర్లు అంటే సుమారు 8 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. 30 ఏళ్ల ఫాక్స్‌ UKలో ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమె నెలకు $9,500 నుండి 7 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఫాక్స్ పేర్కొంది. ఫాక్స్‌కి సోషల్ మీడియాలో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అందం ప్రమాణాలు మహిళలపై విధించబడతాయి. ఫాక్స్‌కి అది నచ్చలేదు. ఈ చికాకు కారణంగా, ఫాక్స్ తన అండర్ ఆర్మ్ హెయిర్‌ను ఏడేళ్ల క్రితం మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మోడలింగ్ కంపెనీలు బాడీ హెయిర్, ముఖ్యంగా అండర్ ఆర్మ్ హెయిర్‌పై దృష్టి పెట్టాలని ఫాక్స్ కోరింది. అందుకే ఆమె బీచ్‌లో లేదా పర్వతాలలో మోడల్స్ ఫోటోలకు పోజులిచ్చింది. కానీ ఆమె ఫోస్ కొంచెం భిన్నంగా ఉండేది. తన అండర్ ఆర్మ్ హెయిర్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఫాక్స్ మేకప్ వేసుకోవడం పూర్తిగా మానేసింది. షేవింగ్ కూడా చేయలేదు. తల వెంట్రుకలు కూడా దువ్వలేదు. ఆమె శరీరాన్ని అలాగే ఉంచుతుంది. మొదట్లో ఆమె ప్రవర్తన కాస్త భిన్నంగా ఉండేది. కానీ రోజులు గడిచేకొద్దీ, ఫాక్స్ బాడీ పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. ఆమెపై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. లక్షల మంది తనను ఫాలో అవుతున్నారు. దీని ద్వారా కోట్లలో డబ్బు సంపాదించానని ఫాక్స్ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version