ఫ్రూట్ జ్యూస్ తాగిన నాలుక రంగు మారిపోయింది… ఎందుకు…?

-

పిల్ల చేష్టలు” ఈ పధం వాడుకలోకి ఊరికే రాలేదని కొన్ని కొన్ని సంఘటనలను చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. కొంత మంది పిల్లలు వేసే వేషాలు చూస్తే వారిని వీళ్ళకు కుదురే ఉండదా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంటుంది. ఉన్న చోట ఉండకుండా… చిన్న పనిని పెద్ద పని చేస్తూ పెద్ద పనిని నాశనం చేస్తూ, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెస్తూ ఆనందం పొందుతూ ఉంటారు పిల్లలు. ఇక వాళ్ళు ఏదైనా తినే సమయంలో, తాగే సమయంలో వేసే వేషాల గురించి, చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

జర్మనీలోని హెనోవెర్‌లో ఒక బాలుడు ఫ్రూట్ జ్యూస్ బాటిల్ కొనుక్కున్నాడు. ఆ బాటిల్ లో జ్యూస్ మొత్తం తాగగా ఒక చుక్క అందులో మిగిలిపోయింది. మరి అది ఎందుకు వృధాగా పోవాలో అనుకున్నాడో ఏమో పాపం… ఆ బాటిల్ లో నాలుక పెట్టి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసాడు. గాలి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆ బాటిల్ లో బాలుడి నాలుక ఇరుక్కుపోయింది. దీనితో అతనికి చుక్కలు కనిపించి ఏడుస్తూ తల్లి తండ్రుల దగ్గరకు వెళ్ళాడు. దాన్ని బయటకు తీయడానికి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నాలు చేసారు.

అయినా ఫలితం లేకుండా పోయింది. బాటిల్ ని కోయడానికి కూడా వీలు లేకుండా అయింది పరిస్థితి. చివరికి ఏం చెయ్యాలో అర్ధం కాక… వైద్యుల వద్దకు వెళ్ళారు. పిల్లల ఆస్పత్రి వైద్యులు ఆ బాటిల్‌లో ఏర్పడిన వాక్యూమ్‌ను తొలగించడానికి గానూ… ఇంజెక్షన్ సిరెంజిలో గాలిని నింపి బాటిల్ లోకి వదులుతూ నిదానంగా బయటకు తీసారు. ఇక బయటకు రాగానే ఆ పిల్లాడి నాలుక నీలం రంగులోకి మారిపోయింది. బాటిల్ లో ఉండిపోయిన కారణంగా రక్తప్రసరణ జరగకపోవడంతో అలా జరిగిందని అతనికి వైద్యం అవసరమని… లేకపోతే నాలుక రుచిని స్వీకరించలేదని వైద్యులు సెలవు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version