60 ఏళ్ల బామ్మను భామ అనుకొని పెళ్లికి సిద్ధమైన 15 ఏళ్ల బాలుడు!

-

ఇదంతా స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీ, ఇంటర్నెట్ యుగం కదా. పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లోనే జరిగిపోతున్న రోజులు ఇవి. 15 ఏళ్ల ఓ బాలుడు కూడా ఇలాగే స్మార్ట్ ఫోన్ లోనే పెళ్లి దాకా వెళ్లిపోయాడు. అస్సాంలోని గోల్ పరా జిల్లాకు చెందిన ఆ బాలుడు కూలీ పని చేస్తున్నాడు. ఓ రోజు ఒక నెంబర్ కు కాల్ చేయబోయి మరో నెంబర్ కు కాల్ చేశాడు. అవతలి వైపు నుంచి అందమైన అమ్మాయి గొంతు వినిపించింది. ఇక మనోడు ఊరుకుంటాడా? మాటలు కలిపాడు.. తర్వాత ప్రేమ పాఠాలు నేర్పాడు. రోజూ ఆ నెంబర్ కు కాల్ చేయనిదో మనోడికి నిద్ర పట్టేది కాదు. ఓరోజు అవతలి నుంచి నిన్ను చూడాలనుంది అని అనేసరికి ఎగేసుకుంటూ తన అడ్రస్ కు వెళ్లాడు. వెళ్లాక ఆమెను చూసి మూర్చబోయాడు. ఎందుకంటే.. ఆమె 16 ఏళ్ల పడుచు కాదు.. 60 ఏళ్ల బామ్మ. మగదిక్కు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఆ ముసలావిడ కూడా తోడు కోసం చూస్తుందట. మనోడు దొరికాడు. ఇక వదులుతుందా? బామ్మను చూసి పారిపోతున్న మనోడిని పట్టుకున్న ఇరుగుపొరుగు ఆ బామ్మతో మనోడి పెళ్లి చేశారు. దీనిపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చిన్న పిల్లల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version