అయ్యో రావణా.. రాముడిలా సాహసం చేసి ప్రాణాలు విడిచావు…!

-


దల్బీర్ సింగ్. పంజాబ్ ట్రెయిన్ యాక్సిడెంట్ లో తాను మరణించి మరో పది మందిని కాపాడాడు. అది కూడా రావణ వేషంలో ఉన్నా.. రాముడిలా సాహసం చేసి తన ప్రాణాలు అర్పించాడు. అమృత్ సర్ లో జరిగిన ట్రెయిన్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే కదా. రామ్ లీలా మైదనాంలో రావణుడి వేషం వేసిన దల్బీర్ సింగ్.. సాయంత్రం రావణ దహనాన్ని చూడటానికి జోడా పాఠక్ కు వచ్చాడు. అక్కడ చాలా మంది ఉండటంతో రైలు పట్టాల వైపు వచ్చాడు. అక్కడి నుంచి రావణ దహనాన్ని వీక్షిద్దామనుకున్నాడు. కాని.. ఇంతలోనే పట్టాల నుంచి దూసుకొస్తున్న మృత్యుశకటాన్ని గమనించి.. పట్టాల మీద ఉన్న జనాలను అప్రమత్తం చేశాడు. చాలామందిని పట్టాల నుంచి కిందికి తోశాడు. చివరకు తనే ఆ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

గత పదేళ్ల నుంచి దల్బీర్ సింగ్ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. కాని.. గత శుక్రవారం వేసిన రావణుడి వేషంతో తన జీవితం ముగిసిపోయింది. పదుల మంది ప్రాణాలు కాపాడిన దల్బీర్ సింగ్ ను ఇప్పుడు అంతా రాముడంటూ కొలుస్తున్నారు. కానీ.. దల్బీర్ అకాల మృతితో ఆయన భార్య, అతడి కూతురు ఒంటరివాళ్లయ్యారు. ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలంటూ వాళ్లు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version