అనుమానం పెనుభూతమైతే ఎలా ఉంటదో తెలుసా? పచ్చని కాపురంలోనే కాదు… పెళ్లి పీటల మీదనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు విడిపోయే ప్రమాదం కూడా ఉంటది…
పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతోంది. వరుడు… వధువు నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కూడా కట్టాడు. ఆ ప్రాంతం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది. కానీ.. ఇంతలోనే పెళ్లి కూతురు వాంతులు చేసుకుంది. పెళ్లి మండపంలోనే పెళ్లి పీటల మీద ఉండగానే ఆమెకు వాంతులు అయ్యాయి. అంతే.. వరుడికి అనుమానపు భూతం బయటికి వచ్చింది.
వాంతులు ఎందుకు అయ్యాయి. ఏదో డౌట్ వచ్చింది మనోడికి. అంతే వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు తెలియకుండా కన్యత్వ పరీక్షలు చేయించాడు. గర్భాధారణ పరీక్షలు చేయించాడు. అయితే.. గ్యాస్టో సమస్యల కారణంగా వాంతులు జరిగాయని డాక్టర్లు తెలిపారు.అయితే.. తనకు కన్యత్వ, గర్భాధారణ పరీక్షలను వరుడు చేయించాడని తెలుసుకున్న వధువు… అనుమానపు గొట్టు మొగుడితో కాపురం చేయనని తేల్చి చెప్పింది. పెళ్లి రోజే ఇంత అనుమానం పెంచుకున్న వ్యక్తితో జీవితాంతం ఎలా బతికేది.. అని వెంటనే విడాకులకు అప్లయి చేసింది. దానిపై తీర్పు ఎలా వస్తుందో పక్కన బెడితే.. వాళ్లది ప్రేమ వివాహం.
అవును.. బెంగళూరుకు చెందిన ఈ జంట.. ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఆఫీసులో వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అయితే.. పెళ్లిలో వధువు వాంతులు చేసుకోవడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.