చేతితో రాసిన నోట్స్‌ను.. కంప్యూట‌ర్‌లోకి ఇలా మార్చుకోండి..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న లెన్స్ యాప్‌లో ఇటీవ‌లే ఓ స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని స‌హాయంతో.. చేత్తో రాసిన ఏదైనా ఇంగ్లిష్ నోట్స్‌ను కంప్యూట‌ర్‌లోకి సుల‌భంగా మార్చుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో ఆ నోట్స్ కంప్యూట‌ర్‌లో టైప్ చేసిన అక్ష‌రాల్లా మారుతాయి. ఇక ఈ ఫీచ‌ర్‌ను వాడుకునేందుకు గూగుల్ లెన్స్ యాప్ ఉండాలి. ఈ యాప్ కేవ‌లం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపైనే ల‌భిస్తోంది. అయితే ఐఓఎస్ యూజ‌ర్లు గూగుల్ ఫొటోస్ లేదా గూగుల్ యాప్ స‌హాయంతో ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకు గాను యాప్‌లో ఉండే లెన్స్ టూల్స్‌ను వాడాలి.

ఇక లెన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక‌.. దాన్ని ఓపెన్ చేసి అందులో కెమెరాను ఆన్ చేయాలి. త‌రువాత చేతితో రాసిన నోట్స్‌ను ఆ కెమెరాతో ఫొటో తీయాలి. అనంత‌రం లెన్స్ యాప్ ఆ ఫొటోలో ఉండే టెక్ట్స్‌ను గుర్తించి.. దాన్ని టైప్ చేసిన వాక్యాల్లా జ‌న‌రేట్ చేసి మ‌న‌కు అందిస్తుంది. ఈ క్ర‌మంలో అలా జ‌న‌రేట్ అయిన టెక్ట్స్ ను కాపీ చేసుకోవాలి. ఇక కంప్యూట‌ర్‌లో క్రోమ్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఫోన్‌లో కాపీ అయిన టెక్ట్స్ ఆటోమేటిగ్గా కంప్యూట‌ర్‌లో క్లిప్‌బోర్డుకు కాపీ అవుతుంది. దాన్ని నోట్‌ప్యాడ్ లేదా వ‌ర్డ్ లాంటి సాఫ్ట్‌వేర్‌ల‌లో పేస్ట్ చేసుకోవ‌చ్చు. అనంత‌రం ఆ ఫైల్‌ను కంప్యూట‌ర్‌లో సేవ్ చేసుకోవ‌చ్చు. ఇలా గూగుల్ లెన్స్ యాప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది.

ఇక ఆండ్రాయిడ్ యూజ‌ర్లు గూగుల్ లెన్స్ యాప్ లేక‌పోయినా.. గూగుల్ అసిస్టెంట్‌, గూగుల్ ఫొటోస్‌, గూగుల్ సెర్చ్ యాప్‌లోనూ ఇంట‌ర్న‌ల్‌గా ఉండే లెన్స్ టూల్‌ను ఉప‌యోగించి ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version