నడిరోడ్డు మీద బాతుల గుంపు.. స్పీడ్ గా వెళ్తున్న కార్లు ఒక్కసారిగా..!

-

సాధారణంగా రోడ్డు మీద మనుషులు వెళ్తుంటేనే వాహనాలు ఆగవు. ఎంతో స్పీడ్ గా వెళ్తున్న వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటాలంటే చుక్కలు కనిపిస్తాయి. రోడ్డు దాటే వాళ్లు ఎంత తొందరగా రోడ్డు దాటాలనుకుంటారో.. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు కూడా అంతే త్వరగా తమ గమ్యస్థానాలకు వెళ్లానుకుంటారు. అందుకే.. రోడ్డు ఎంతో బిజీగా ఉండి రయ్ మంటూ వాహనాలు దూసుకుపోతుంటాయి. కాస్త రద్దీగా ఉండే రోడ్డును దాటాలంటే మనిషికే చుక్కలు కనిపిస్తే.. ఓ బాతుల గుంపుకు ఏం కనిపించాలి. కానీ.. అవి ఎంతో ఈజీగా రోడ్డు దాటి ఔరా అనిపించాయి. అర్థం కాలేదా? అయితే.. మనం న్యూజిలాండ్ వెళ్లాల్సిందే.

న్యూజిలాండ్ లోని అక్లాండ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. ఓ బిజీ రోడ్డు మీద వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న సమయంలో ఆ రోడ్డును దాటడానికి ఓ బాతు గుంపు ప్రయత్నించింది. చూస్తుంటే తల్లి బాతు తన పిల్లల గుంపును వేసుకొని రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అది మూడు లేన్ల రహదారి. ఒక లేనును బాతుల గుంపు దాటుతుండగానే స్పీడ్ గా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆ గుంపును చూసి ఆగింది. దాని వెనకే మరోటి.. అలా బాతుల గుంపు మరో లేనుకు వెళ్లే దాకా కార్లు ఒకదాని వెనుక మరోటి ఆగాయి. రెండో లేనుకు ఆ గుంపు వెళ్లేసరికి ఆ లేన్ లో వెళ్తున్న కార్లు కూడా ఆగిపోయాయి. అలా.. మూడు లేన్లలో కార్లు ఆగిపోయాయి. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక.. బాతుల గుంపు రోడ్డు దాటిన తర్వాత గానీ ఆ కార్లు అక్కడి నుంచి కదలలేదు. ఇక.. ఈ దృశ్యాన్ని గమనించిన అక్లాండ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version