సాధారణంగా ఎవరైనా తమ కంటే ఎక్కువ ఆకారంలో ఉన్న ప్రాణి ఎదురుగా వస్తే.. చచ్చేంత భయపడుతారు. ఆ చుట్టు పక్కల కూడా ఉండ కుండా కిలో మీటర్ మేరా దూరం పోతారు. దేనిని అయినా.. ధైర్యంగా ఎదురుకోవాలని నీతి వ్యాఖ్యాలు చెప్పినా.. ఆచారణలో సాధ్యం కాదు. ఎదుర్కోవడానికి ప్రయత్నించినా.. తీర జారుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ విషయంలోనే స్ఫూర్తిని ఇస్తుంది. ఒక చిన్న బాతు.. దాని కన్నా.. ఆకారంలో భారీగా ఉండే ఎద్దులను ఏ మాత్రం బయపడకుండా ఎదుర్కొంటుంది.
అంతే కాకండా.. అవి బాతు పై దాడి చేయడానికి వస్తున్నా.. ఏ మాత్రం జంక కుండా బాతు తన ముక్కుతో ప్రతి దాడి చేస్తుంది. Bulls అన్ని రౌండప్ చేసి కన్‌వ్యూస్ చేసినా.. బాతు తన దాడి మాత్రం ఆపడం లేదు. దీంతో Bulls బతుకు దేవుడా అంటూ అక్కడి నుంచి జారుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న ఈ వీడియో మనుషులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.
ఇక్కడ బాతు కన్న ఎద్దులు ఆకృతిలో పెద్దగా ఉన్నా.. గుంపులుగా ఉన్నా.. బాతు వెనుకాడుగు వేయలేదు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది.. సమస్య ఎంత పెద్దది అయినా.. భయపడేదే లేదు. మనల్ని చూసే సమస్య భయపడాలి. కాగ వీడియో కింద కామెంట్స్ కూడా ధైర్యం అంటే ఇదేరా బాబు.. అంటే పెడుతున్నారు. మనుషులు కూడా ఈ బాతును చూసి నేర్చుకోవాలని అంటున్నారు.
This is Amazing pic.twitter.com/FkheAEJHpB
— Science & Nature (@Sci_Nature0) February 7, 2022