ఇద్దరు నూతన దంపతులు రిసెప్షన్‌లో కూర్చుని ఉన్నారు. గెస్ట్‌లు వస్తే వారితో ఫొటోలు దిగాల్సింది పోయి.. అదేమీ పట్టించుకోకుండా పెళ్లి కొడుకు పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ ఉండిపోయాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పబ్‌జి మానియా నడుస్తోంది. పబ్‌జి ఆడే వారిని ఏమీ అనలేకుండా ఉన్నాం. ఎందుకంటే.. మనం ఏదైనా చేస్తే.. వారు రెచ్చిపోయి మరీ స్పందించేలా ఉన్నారు. పబ్‌జి మాయలో పడి ఏ అఘాయిత్యం చేస్తారోనని మనం భయపడాల్సి వస్తోంది. అందుకే ఆ గేమ్ ఆడే వారిని వీలైనంత వరకు కదిలించకుండా ఉండడమే ఉత్తమం. అవును, సరిగ్గా ఆ నవవధువు కూడా అలాగే చేసింది. తన భర్త తమ మ్యారేజ్ రిసెప్షన్‌లో తనను, గెస్ట్‌లను పట్టించుకోకుండా పబ్‌జి మొబైల్ గేమ్ ఆటలో మునిగిపోయేసరికి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే ఏమీ అనకుండా సైలెంట్‌గా తన భర్తను చూస్తూ గడిపింది.
పై వీడియోలో చూశారు కదా.. ఇద్దరు నూతన దంపతులు రిసెప్షన్‌లో కూర్చుని ఉన్నారు. గెస్ట్‌లు వస్తే వారితో ఫొటోలు దిగాల్సింది పోయి.. అదేమీ పట్టించుకోకుండా పెళ్లి కొడుకు పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ ఉండిపోయాడు. దీంతో అతన్ని ఏమీ అనలేక అతని భార్య పక్కనే అతని ఆటను చూస్తూ అలాగే సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆ పెళ్లికొడుకు పబ్‌జి ఆడుతున్న దృశ్యాలను ఎవరో షూట్ చేసి నెట్‌లోకి అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పబ్‌జి మొబైల్ వల్ల గతంలోనూ మనం ఇలాంటి పలు వింతైన సంఘటనలను చూశాం. ఓ విద్యార్థి పబ్‌జి లో ఉండే ప్రీమియం కంటెంట్‌ను వాడుకునేందుకు ఏకంగా తన తండ్రి నుంచి రూ.50వేలను దొంగిలించాడు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే పబ్‌జి గేమ్‌ను ఆడుకోనివ్వడం లేదని, సొంత కుటుంబ సభ్యులనే గాయపరిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా.. పబ్‌జి ఆడేవారి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం కదా..!