‘యతి’ అడుగుజాడలు కనుగొన్న భారతసైన్యం

-

Indian army found Yati foot prints
Indian army found Yati foot prints

శతాబ్దాలుగా మిస్టరీగా మిగిలిపోయిన ‘యతి’ పాదముద్రలను తాము కనుగొన్నామని భారత సైన్యం ప్రకటించింది. ధ్రువపు ఎలుగుబంటిలా వంటి నిండా బొచ్చుతో, భారీ గొరిల్లాలా ఉంటుందని, రెండు కాళ్లతోనే నడుస్తుందని, అత్యంతవేగంగా పరుగుతీయగలదని ఎన్నో ఏళ్లుగా ‘యతి’ ప్రచారంలో ఉంది. యతి అంటే హనుమంతుడని, ఆయన హిమాలయాలలోనే నివాసముంటాడని భారతీయ హిందూ విశ్వాసాల నమ్మకం.

Alleged Yeti footprint found by Michael Ward and photographed by Eric Shipton taken at Menlung Glacier on the 1951 Everest Expedition with Edmund Hillary in Nepal.Courtesy : Wikipedia

వివాదాస్సద మంచుమనిషి ‘యతి’ పాదముద్రలను తాము కనుగొన్నామని భారత సైన్యం నేడు ప్రకటించింది. నేపాల్‌కు చెందిన మకాలు బేస్‌ క్యాంప్‌ పరిసరాల్లో ఈ అడుగుజాడలను తమ బృందం ఒకటి చూసిందని భారత సైన్య ప్రజాసమాచార అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తమ ట్విటర్‌ ఖాతాలో తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా వారు విడుదల చేశారు.

Indian army found Yeti foot prints

ఈనెల 9న నేపాల్‌ దగ్గర్లోని మకాలు బేస్‌ క్యాంప్‌ పరిసరాల్లో భారత సైన్య పర్వతారోహక బృందం ఒకటి, అంతుచిక్కని పాదముద్రలను గమనించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో రెండు కాళ్లతో నడిచే జీవి వేసిన అడుగులుగా వారు గుర్తించారు. తాము వీటిని మంచుమనిషి అడుగులుగా భావిస్తున్నామని, గతంలో కూడా ఇదే ప్రాంతంలో యతి అడుగుజాడలు కనిపించాయని వారు గుర్తుచేశారు. గత పదిరోజులుగా వీటిని పరిశీలించి, గతంలో యతికి సంబంధించిన ఆనవాళ్లతో పోల్చిచూసిన తర్వాతే తాము ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని ఆర్మీ ప్రకటించింది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఫోటోలు, విడియోలను తదుపరి పరిశోధనల నిమిత్తం శాస్త్రవేత్తలకు అందించినట్లు సైన్యం తెలిపింది.

ఈ యతి గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హిమాలయాల్లో, నేపాల్‌, భూటాన్‌, చైనా, మంగోలియా, రష్యా, సైబీరియా ప్రాంతాల్లో వీటిని చూసినట్లు చాలామంది ప్రకటించారు. కానీ ఏ ఒక్కరూ సరైన ఆధారం చూపించలేకపోయారు. నేపాల్‌ జానపద కథల్లోనూ, భారత ఇతిహాసాల్లోనూ యతి ప్రస్తావన ఉంది. హిందూమత విశ్వాసకులైతే యతి మరెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడే అని చెపుతున్నారు. హనుమంతుడు చిరంజీవి అనీ, రామాయణ కాలంలోనే, తనను చిరంజీవిగా సీతాదేవి దీవించిందనీ, హిమాలయాల్లో తాను ఇక నివాసముండబోతున్నట్లు స్వయంగా ఆంజనేయుడే చెప్పినట్లుగా వీరు అంటున్నారు.

1921లోనే ఒక బ్రిటిష్‌ పర్వతారోహక బృందం దాదాపు 21వేల అడుగుల ఎత్తులో తాము యతి పాదముద్రలు చూసినట్లు ప్రకటించారు. అయితే శాస్త్రవేత్తలు వీటిని తోసిపుచ్చుతున్నారు. ఆ ముద్రలు హిమాలయాల్లో ఎత్తైన ప్రాంతాల్లో తిరిగే ఒక రకమైన ఎలుగుబంటివని, ఇటువంటి ఎలుగులు అక్కడక్కడా చాలా ఉన్నాయని వారి వాదన. 18వ శతాబ్దంలో కూడా చాలామంది నేపాల్‌, సైబీరియా ప్రాంతాల్లో ఒళ్లంతా బొచ్చుతో, చాలా పెద్దదైన ఒక ద్విపాదజీవిని చూసామని చెప్సారు. కానీ, ఎప్పడూ, ఎక్కడా కూడా శాస్త్ర పరీక్షలకు నిలబడే ఆధారాలు లభించలేదు. ఇవన్నీ గమనించిన నేపాల్‌ ప్రభుత్వం కూడా 1950లో యతిని వేటాడటానికి అనుమతించింది. ప్రస్తుతం భారత సైన్యం కూడా తన ప్రకటనలో ఇలా అంది.

Indian army found Yathi foot prints

‘శాస్త్రవిజ్ఞానపు ఆవేశాన్ని పురిగొల్పేందుకు, ఈ విషయమై తిరిగి ఆసక్తిని రేకెత్తించేందుకు మాత్రమే మేము కనుగొన్నదాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నాము. దీనిని నిరాకరించే మనలో కొంతమందికి దీని గురించి తప్పకుండా తెలిసేఉంటుంది. ఎందుకంటే ప్రకృతి, చరిత్ర మరియు శాస్త్రవిజ్ఞానం… ఎప్పుడూ మిగిలేఉంటుందని వారికీ తెలుసు.

Read more RELATED
Recommended to you

Exit mobile version