ఎయిర్ లైన్స్ సంస్థ పేరే తప్పుగా రాశారు..!

-

ఎయిర్ లైన్స్ సంస్థ అంటే ఎంత హుందాగా ఉండాలి.. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత అలర్ట్ గా ఉండాలి. కానీ.. హాంకాంగ్ కు చెందిన కాథే పసిఫిక్ అనే ఎయిర్ లైన్స్ సంస్థకు బొత్తిగా అలర్ట్ నెస్ లేనట్టుంది. అందుకే.. కొత్తగా స్టార్ట్ చేసిన విమానం మీద తన సంస్థ పేరు తప్పుగా రాసి ఉన్నా గుర్తించలేకపోయింది. నిజానికి ఆ కంపెనీ పేరు ఇంగ్లీష్ లో cathay pacific.. మీరు కింద చూస్తున్న ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుంది స్పెల్లింగ్. కానీ.. ఓసారి పైన ఫోటో చూడండి.. ఎలా ఉంది చూశారా? F మిస్సయింది కదా. ఆ పేరులో ఎఫ్ మిస్సయిందని ఆ కంపెనీ కూడా గుర్తించలేకపోయింది. కొంతమంది ప్రయాణికులు తప్పుగా ప్రింట్ చేయించిన పేరును ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో లెంపకాయలు వేసుకున్న సంస్థ వెంటనే తప్పుగా ఉన్న ప్రాంతంలో ఓ కవర్ అంటించి త్వరలోనే ఆ పేరును సెట్ చేస్తామంటూ ఓ ట్వీట్ ట్వీటింది. ఓ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ అయి ఉండి పేరు ప్రింటింగ్ లోనూ ఇంత నిర్లక్ష్యమా? దేవుడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version