సాధారణంగా బెండ మొక్కలు నాలుగు లేదా ఐదడుగుల వరకు పెరుగుతాయి. వేడి వాతావరణంలో ఉంటే బెండమొక్కలు బాగా పెరగడంతో పాటు బాగా కాస్తాయి. సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, గరుప నేలలు బెండమెక్కలకు అనుకూలంగా ఉంటయి. అయితే యలమంచిలి లంక హిందూ పాఠశాలలో నాటిన బెండమొక్కలు ఏకంగా ఏడడుగులు మించి పెరిగాయి.
గత ఏడాది ప్రభుత్వం ద్వారా పాఠశాలలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఈ పాఠశాల వారు ప్రభుత్వం నుంచి వచ్చిన విత్తనాలను చల్లగా ఏడడుగులపైగా పెరిగిన బెండ మొక్కలు బాగా కాయలు కూడా కాశాయని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వి.వి.వి.సుబ్బారావు చెప్పారు. ఈ బెండకాయ మొక్క ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
దీనిపై ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించగా బెండమొక్కలు ఐదు అడుగుల వరకు సహజమని చెప్పారు. అంతకు మంచి పెరిగితే సారవంతమైన నేల, మంచి విత్తనాల వల్ల ఇలా ఎదుగుతాయని తెలిపారు. అయితే సరైన నేలలో మంచి విత్తనాలను అనువైన పద్ధతుల్లో నాటితే కూడా మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పారు.