వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కి తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన వీరు ఈనెల 22న చెన్నైలో జరుగనున్న సౌత్ ఇండియా అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్ కి ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్ కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్ సభ నియోజకవర్గాలు పునర్విభజన అంశం పై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నాయకులకు ఇప్పటికే స్టాలిన్ ఆహ్వానం పంపారు.
ఈ నేపథ్యంలోనే డీఎంకే నేతలు వైఎస్ జగన్ ను కలిశారు. లోక్ సబ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం పై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా..? లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.