హరికృష్ణ మరణం బాలకృష్ణను సంబర ఆశ్చర్యంలో ముంచెత్తిందట…!

-

పాపం శమించుగాక.. ఈమాటలు అన్నది స్వయానా నందమూరి బాలకృష్ణే. నమ్మరా? మీరు నిజాలు చెబితే ఎందుకు నమ్ముతారు..అందుకే మీరు ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చాం. అయితే.. అసలు బాలయ్య బాబు అలా ఎందుకు అన్నాడు. అసలు సంగతి ఏంటి? సందర్భం ఏంటో ముందు తెలుసుకోవాలి కదా.

కూకట్‌పల్లి అభ్యర్థిగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని నిలబెట్టిన విషయం తెలుసు కదా మీకు. నందమూరి సుహాసిని ఎవరో కాదు.. హరికృష్ణ కూతురు.. జూనియర్ ఎన్టీఆర్ సోదరి. ఓకేనా. ఆమె నామినేషన వేసేముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి తాతను ఓసారి స్మరించుకున్నది. ఆమె వెంట బాలయ్య బాబు కూడా వెళ్లాడు. నివాళుల కార్యక్రమం అనంతరం.. మీడియాతో మాట్లాడాడు. ఆసమయంలోనే నందమూరి హరికృష్ణ గురించి గొప్పగా చెబుతూ.. ఆయన మరణం సంబర ఆశ్చర్యంలో ముంచెత్తిందంటూ అన్నాడు. మరి తొందర పాటులో అలా అన్నాడా? ఏంటి సంగతి అనేది పక్కన బెడితే.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం.. బాలకృష్ణను నెటిజన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. మీరు కూడా ఆ వీడియో చూసి తరించండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version