వైరల్ వీడియో; ఛీఛీ పాల ప్యాకెట్లకి కక్కుర్తి పడిన పోలీస్ అధికారి…!

సాధారణంగా పోలీసు అధికారులకు జీతాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. కొంత మంది పరిస్థితులు కలిసి వస్తాయి కాబట్టి కాస్త ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రాణాలకు రిస్క్ ఉంటుంది గాని డబ్బుకి మాత్రం కొరత ఉండదు. ఎక్కడో కొంత మంది ఆర్ధిక ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతే. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక పోలీస్ అధికారి చేసిన కక్కుర్తి పని చూస్తే మైండ్ పోతుంది.

రాత్రి వేళల్లో సాధారణంగా పెట్రోలింగ్ చేసే పోలీసు అధికారులు ఎం చేస్తారు…? అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడతారు. కాని ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రం పాల ప్యాకెట్లను దొంగతనం చేయడాన్ని వృత్తిగా పెట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా నగరంలోని ఓ స్టోరు వద్ద ఆరుబయట తెల్లవారుజామున,

పాలప్యాకెట్లను రోజూ మాదిరిగా ట్రేలలో ఉంచారు. పోలీసు వ్యానులో తిరుగుతూ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ కిందకు దిగి రెండు పాలప్యాకెట్లను దొంగతనం చేసి పోలీసు వ్యానులో కూర్చున్న మరో కానిస్టేబుల్‌కు అందించడం వెలుగులోకి వచ్చింది. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. పాలప్యాకెట్లను దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.