ఒక్క రోజే 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్…!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను సోమవారం సస్పెండ్ చేసారు. సభా నాయకుడుగా ఉన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున అమరావతికి మద్దతుగా నినాదాలు చేసారు. జై అమరావతి, జైజై అమరావతితో పాటుగా,

మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేసారు. దీనితో వారు వెనక్కు తగ్గాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. అయినా సరే వాళ్ళు పోడియం వద్ద నినాదాలు చేస్తూ జగన్ ప్రసంగానికి అంతరాయం కలిగించారు. వాళ్ళు ఎంతకు వెనక్కు తగ్గకపోవడంతో పోడియం వద్ద నుంచి వారిని పంపించాలని స్పీకర్ కు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేసారు.

అనంతరం స్పందించిన సభా వ్యవహారాల శాఖా మంత్రి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారిని మార్షల్స్ ద్వారా బయటకు పంపాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వారిని స్పస్పెండ్ చేసారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరు అసెంబ్లీ లాభీలో బైటాయించి తమ నిరసన తెలిపారు. దీనికి చంద్రబాబు మద్దతు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news