కేఏ పాల్ బాక్సింగ్ చేశాడు.. ఆర్జీవీ కౌంటరేశాడు..!

-

కేఏ పాల్ కారులో వెళుతూ బాక్సింగ్ చేశాడు. అవును.. కారులో కూర్చొని తన చేతులతోనే బాక్సింగ్ చేశాడు. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశాడు. అదే ఇక్కడ ట్విస్ట్.

కేఏ పాల్.. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన గురించి మీకే ఎక్కువ తెలుసు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు చూసే ఉంటారు. ఆయనకు ఓ పార్టీ కూడా ఉంది. దాని పేరు ప్రజాశాంతి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీయే గెలుస్తుంది అంటూ ఆయన ఏదోదో మాట్లాడతాడు. అవన్నీ వదిలేద్దాం.. కానీ ఓ వీడియో గురించి మాత్రం మాట్లాడుకుందాం.

కేఏ పాల్ కారులో వెళుతూ బాక్సింగ్ చేశాడు. అవును.. కారులో కూర్చొని తన చేతులతోనే బాక్సింగ్ చేశాడు. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశాడు. అదే ఇక్కడ ట్విస్ట్. ఆ వీడియోను షేర్ చేయడమే కాదు.. ఆ వీడియోకు అద్భుతమైన క్యాప్సన్ పెట్టాడు ఆర్జీవీ.

ప్రపంచ దిగ్గజ బాక్సర్ చాంపియన్ అయిన మైక్ టైసన్ ను మట్టికరిపించిన ఈవాండర్ హోలీఫీల్డ్ కు ట్రెయినింగ్ ఇచ్చింది కేఏ పాలే అని నేను నమ్ముతున్నా.. అంటూ వర్మ సెటైర్ వేశాడు. నెటిజన్లకు ఓవైపు కేఏ పాల్ వీడియో పండుగ.. మరోవైపు ఆర్జీవీ ట్వీట్ పండుగతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version