షాక్; 60 ఏళ్ళ మామ్మ గారితో 22 ఏళ్ళ యువకుడి ప్రేమాయణం…!

-

ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ఒక యువకుడు 60 ఏళ్ళ మామ్మ గారితో ప్రేమలో పడ్డాడు. అవును అండీ బాబు నిజం ఇది. ఆమె ఏడుగురు పిల్లలకు తల్లి, ఏడుగురు పిల్లలకు అమ్మమ్మ. ఈ వింత ప్రేమ కథ, ఎట్మదుద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ప్రేమ కథ ఏ విధంగా బయటకు వచ్చింది అనేది చూస్తే,

60 ఏళ్ల వృద్దురాలి భర్త, ఒక యువకుడిపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తన మీద కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకున్న ఆ యువకుడు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ గొడవలో వృద్దురాలు యువకుడు ఇద్దరూ ఊహించని షాక్ ఇచ్చారు. తాము పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

దీనితో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని వారిని వారించే ప్రయత్నం చేసారు. ఏ విధంగా చూసినా సరే మీ బంధాన్ని అంగీకరించేది లేదని వారు స్పష్టం చేసారు. పోలీసులు కూడా ఈ జంటకు తమ మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉందని, వారి ప్రేమను కొనసాగించవద్దని సూచించారు. అయితే వాళ్ళు వెనక్కు మాత్రం తగ్గలేదు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించినందుకు గాను యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version