నేను చనిపోయాక నా ఆత్మ ఇక్కడికే వస్తుంది. నేను గుడిని శుభ్రం చేయటం లేదు. చెడు ఆలోచనల నుంచి నా మనసును శుభ్రం చేస్తున్నా..
నా జీవితం నా ఇష్టం. నా జీవితాన్ని నా ఇష్టమొచ్చినట్టుగా బతికే హక్కు నాకు ఉంది. నేను ఇలాగే ఉంటా మీకు ఏమన్నా సమస్యా? రాత్రి వైన్ తాగుతూ.. పొద్దున్నే శివలింగానికి అభిషేకం చేస్తా. అదే నా లైఫ్ స్టయిల్. నా లైఫ్ నాకు నచ్చినట్టుగా బతుకుతా. నన్ను ఎవరూ జడ్జ్ చేయొద్దు.. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఆ వీడియోలో శ్రీరెడ్డి శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేస్తూ కనిపిస్తుంది.
నేను చనిపోయాక నా ఆత్మ ఇక్కడికే వస్తుంది..
మరో వీడియోలో నేను చనిపోయాక నా ఆత్మ ఇక్కడికే వస్తుంది. నేను గుడిని శుభ్రం చేయటం లేదు. చెడు ఆలోచనల నుంచి నా మనసును శుభ్రం చేస్తున్నా.. అంటూ శ్రీరెడ్డి గుడిని శుభ్రం చేస్తున్న మరో వీడియోను పోస్ట్ చేసింది.
నేను చాలా మంచి అమ్మాయిని..
నేను చాలా మంచి అమ్మాయిని… నాకు గుడిని శుభ్రం చేయడమంటే చాలా ఇష్టం. హరోంహర.. అంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.
ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపిస్తూ… అందరినీ ఏకిపారేసే శ్రీరెడ్డిలో ఒక్కసారిగా ఇంత భక్తి వచ్చిందేంటబ్బా అంటూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.