వింత ఆచారం.. ఆ ఊళ్లోని మగాళ్లందరికీ ఇద్దరు భార్యలు….!

-

ఆహా.. బంపర్ ఆఫర్ ఇది.. ఒక్క భార్య దొరకడమే గగనంగా మారుతున్న ఈరోజుల్లో ఇద్దరు భార్యలంటే ఆ ఊరి మగాళ్లు అదృష్టవంతులు భయ్యా.. అంటారా?

ఎవరి ఆచారాలు వాళ్లకు. ఎవరి సంప్రదాయాలు వాళ్లకు. అయితే కొన్ని ఆచారాలు మాత్రం వింతగా ఉంటాయి. విచిత్రంగా ఉంటాయి. ఇవేం ఆచారాలురా బాబోయ్ అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చదువుకునే వార్త కూడా అటువంటిదే. వాళ్ల వింత ఆచారం గురించి తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. రండి.. ఓసారి రాజస్థాన్ వెళ్లొద్దాం..

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా దెరాసర్ అనే గ్రామం అది. ఆ గ్రామం జనాభా 600 మాత్రమే. కానీ.. ఆ ఊళ్లోని వ్యక్తి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. ఇది ఇప్పటి ఆచారం కాదు.. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే. ఎందుకు పాటించాలి అంటారా? అక్కడికే వస్తున్నాం.

ఆ ఊరికి చెందిన ఏ వ్యక్తి అయినా ముందుగా ఒక పెళ్లి చేసుకుంటాడు. కానీ.. మొదటి భార్యకు పిల్లలు పుట్టరు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి చేసుకున్న మహిళకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యకు కూడా పుడతారట. మొదటి భార్యను చేసుకొని ఎన్ని రోజులు వెయిట్ చేసినా పిల్లలు మాత్రం పుట్టరట. రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. ఆ ఊరి ప్రజలకు మాత్రమే అలా అవుతుందట. అందుకే.. మొదటి భార్య కూడా తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి జరిపిస్తుందట. భలే ఉంది కదా వీళ్ల ఆచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version