ట్రెండింగ్ నౌ Kacha Badam.. ప‌ల్లి పాట ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది..

-

సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.. మనలో టాలెంట్ ఉంటే..ఎప్పుటికైనా పైకి వస్తాం.. టాయిలెట్ వచ్చినవాడ్ని టాలెండ్ ఉన్నవాడ్ని ఎవ్వరూ ఆపలేరు అని..అదేదో సినిమాలో చెప్పినట్లు.. టాలెంట్ ఉన్నవారు ఈ టెక్నాలజీకి ఎంతదూరంలో ఉన్న ఒకరోజు మాత్రం ప్రపంచానికి పరిచయం కావాల్సిందే..అలా మన తెలుగులోనే ఎంతోమంది ఉన్నారు..ఎప్పుడు తాజాగా ఓ బెంగాళీ అతను..పచ్చివేరుశనగ అమ్ముకునే వ్యక్తి సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.

మీకు ఇలా చెప్తే అర్థంకాదు..ఇన్ స్టాగ్రామ్ లో ఈ సాంగ్ విన్నారా..కచ్చాబాదం సాంగ్..ఇప్పుడు అన్నింటా ఇదే ట్రెండ్..ఎక్కడా విన్నా ఆయన గొంతే..మోన్నా ఆ మధ్య బచన్ పా కా ప్యార్, సుఖీభవ హడావిడి చేశాయి..ఇప్పుడు ఇది. అయితే, ఇతని కథ కాస్త డిఫ్రెంట్..ఈ పాట ఎందుకు పాడాడు..ఎలా ట్రెండ్ అయిందో చూసేద్దాం..

పశ్చిమబెంగాళ్ లోని బీర్భూమ్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్జూరి గ్రామంలోని దుబ్రాజ్‌పూర్ బ్లాక్‌లో భుజన్ బద్యాకర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పచ్చిపల్లీలు అమ్ముకుంటూ..వీధి వీధి తిరిగి అమ్మేవాడు. మాసినబట్టలు, అరిగిన చెప్పులు, నెరిసిన గడ్డం..కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా తన జీవితం ఉండేది..రోజుకు రెండు వందలు రూపాయిలు వచ్చినా చాలు అనుకునే భుజన్ అలా వీధి వీధి తిరిగి పల్లీలు అమ్మేవాడు.. భుబన్ కు భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇలా వీధి వీధి తిరిగి రోజంతా గొంతుపోయేలా అరిచినా పెద్దగా ఎవరూ పల్లీలు కొనేవారు కాదు..అప్పుడే భుజన్ కు ఒక ఆలోచన వచ్చింది.. అంతే. తానే స్వయంగా ఒక లిరిక్స్ రాసి.. పాట పాడి వీడియో రికార్డు చేసుకుని.. అది ప్లే చేసుకుంటూ పల్లీలు అమ్మేవాడు.. పాటకు ఫిదా అయిన జనం పల్లీలు ఎగబడి కొనేవాళ్లు.. ఈ క్రమంలో ఆ పాటను ఓ వ్యక్తి షూట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.

అంతే ఆ పాట కాస్త వైరల్ అయింది. కట్ చేస్తే.. ఇన్ స్టా గ్రామ్ లో, ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో ఇలా ఎక్కడ చూసిన కచ్చాబాదం రీల్స్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట ట్రెండింగ్ అయింది..సోషల్ మీడియాలో..వాయిస్ బాగుండి..ఒక ఊపు ఉంటే..మీనింగ్ తెలియకపోయిన మన నెటిజన్లు నేర్చేసుకుంటారు.

సరే అంతా బాగేనే ఉంది అనుకుంటున్నారేమో..తను పాడిన పాట ఓ రేంజ్ లో ట్రెండ్ అయినప్పుటికీ పాడిన భువన్ మాత్రం సంతోషంగా లేడు..ఎవరెవరో వస్తారు..పాడమంటారు..రికార్డు చేసుకుంటారు వెళ్తారు..డబ్బులు మాత్రం ఇచ్చేవాళ్లు కాదు. ఇలా జరుగుతుంటే..చిర్రెత్తిపోయిన భువన్ దుబ్రాస్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాడు. ఆ వీడియోలు అన్నీ తీసేయించాలని, అందరి మీద చర్యలు తీసుకోవాలన్నాడు..కానీ పోలీసులు ఏం చేయలేక పోయారు. అలా నిరాశలో ఉన్న భువన్ కు అదృష్టం తలుపుతట్టింది.

తాను పాడిన పాట ఇండ్రస్టీకి పాకింది.. ఆయనతో గోధులేబేలా అనే మ్యూజిక్ కంపెనీ అతనితో పాట పాడించింది..భువన్ స్టైలే మారిపోయింది. మాసిన బట్టలు పోయాయి..తెల్లటిపట్టుపంచ కట్టాడు..కళ్లజోడు పెట్టాడు. కచ్చాబాదం పాటను ర్యాప్ వర్షన్ లో రీమిక్ చేసింది ఆ మ్యూజిక్ కంపెనీ. ఆ పాటకు తగ్గుట్టుగా ఓ అమ్మాయి మోడ్రన్ డ్రస్ లో భువన్ తో స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఈ వీడియో మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంటుంది. భువన్ కు కూడా ఆర్థిక సాయం చేశారు.

భువన్ ఓ ఇంటర్వూలో తాను పదేళ్ల నుంచి పల్లీలు అమ్ముకుంటున్నా తన ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని..ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు.

మొత్తానికి..పచ్చిపల్లీలు అమ్ముకోవడానికి పాడిన పాట కాస్త..ఇండస్ట్రీ మెట్లు ఎక్కింది..టాలెంట్ ఉంటే..ఎవరి లైఫ్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకుంటుందని భువన్ ద్వారా మరొకసారి ప్రూవ్ అయింది..మీరేమంటారు..

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version