టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే ప్రస్తుతం కాలంలో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తు వార్తలలో ఉంటారు. ఇక ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ చేసే హాంగామా అంతా ఇంతా ఉండదు. సమయం దొరికితే.. ట్విట్టర్ ఖాతా ద్వారా తన నోటి దూలను ప్రదర్శిస్తాడు. ఇప్పుటికే టాలీవుడ్ పై, పవన్ కళ్యాణ్ పై, ఏపీ సీఎం జగన్ పై ఇలా ఎంతో మందిని ట్విట్టర్ ద్వారా ఒక ఆట ఆడేసుకున్నాడు.
తాజా గా ఈ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎప్పుడు ఇతరకుల గురించి ట్వీట్ చేసే వర్మ ఫస్ట్ టైం తన గురించి వ్యంగ్యం ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ”చిన్న పిల్లలను పిల్లలు అని పెద్దలు మాత్రమే అంటారు. అయితే ఏ చిన్న పిల్లవాడు కూడా తనను పిల్లవాడు అని అనుకోరు. నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు పెద్ద వాళ్లందరినీ మూర్ఖులుగా భావించాను. జీవితంలో ఎప్పుడూ కూడా పెద్ద వాడిని కావద్దని అనుకున్నాను” అని ట్వీట్ చేశాడు.
దీంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వర్మ ఇంకా చిన్న పిల్లవాడే అని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎమైనా వివాదాస్పద డైరెక్టర్ తన ట్విట్ తో మరోసారి వార్తలలోకి ఎక్కారు.
Only an adult thinks a child is a child …But no child thinks he or she is a child ..When I was a child, I realised that all adults are idiots and ever since I refused to grow up 💪
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2022